Medicare Hospitals

ఆపరేషన్లు ›

వెరికోస్ వెయిన్స్ · AI చిత్రం

వెరికోస్ వెయిన్స్

Varicose veins

మత్తు: స్పైనల్ లేదా జనరల్ సాధారణంగా 1–2 రోజులుడా. వంశీ కృష్ణ

ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: కాలి మీద మానని పుండు, ఒక్కసారిగా వాపు, ఎర్రబడి నొప్పి

కాళ్ల సిరల్లో కవాటాలు బలహీనపడి రక్తం కిందే నిలిచిపోవడం – ఎక్కువసేపు నిలబడి పనిచేసేవాళ్లకి సాధారణం

ఎలా చేస్తారు

ఉబ్బిన సిరను మూసివేస్తారు లేదా తీసేస్తారు – కోతలు చిన్నవి. తర్వాత స్టాకింగ్ వేసుకోవడం ఆపరేషన్‌లో సగం.

దీన్నే ఇలా కూడా అంటారు: కాళ్ల నరాలు ఉబ్బడం · కాలు నొప్పి, బరువు · సాయంత్రానికి కాలు వాపు · నరాలు నీలంగా

ఖర్చు

ఈ ఆపరేషన్‌కి ఎంత అవుతుందో, ఏ రోజు ఎవరు ఉంటారో 9346113364 కి ఫోన్ చేసి అడగండి. పరీక్ష తర్వాత డాక్టర్ కచ్చితమైన మొత్తం చెబుతారు.

హాస్పిటల్ ఛార్జీలు – పూర్తి వివరాలు →

ఇది ఆపరేషన్ – తెలిసి ఉండాల్సినవి

ఏ ఆపరేషన్‌కైనా మత్తు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్, గాయం ఆలస్యంగా మానడం వంటి సమస్యలు రావచ్చు; కొందరికి మళ్ళీ చేయాల్సి రావచ్చు. మీకు ఇది అవసరమా, మీ షుగర్, బి.పి., గుండె పరిస్థితితో సరిపోతుందా అన్నది పరీక్ష, టెస్టుల తర్వాతే డాక్టర్ నిర్ణయిస్తారు. సమ్మతి పత్రం తీసుకునే ముందు మీ ఆపరేషన్‌కి ఉన్న ప్రమాదాలను ఆయన విడిగా వివరిస్తారు – అడగడానికి సంకోచించకండి.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·స్కాన్ (డాప్లర్) రిపోర్ట్ తీసుకురండి
  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు
  • ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే చెప్పండి

తర్వాత ఏం చేయాలి

  • ·డాక్టర్ ఇచ్చిన స్టాకింగ్ (మేజోళ్ళు) చెప్పినన్ని వారాలు వేసుకోవాలి – ఇదే మళ్ళీ రాకుండా ఆపేది
  • ·పడుకున్నప్పుడు కాళ్ల కింద దిండు – గుండె కంటే ఎత్తుగా
  • ·రోజూ నడక; ఒకే చోట ఎక్కువసేపు నిలబడొద్దు, కూర్చోవద్దు

ఏం చేయకూడదు

  • ·గంటల తరబడి నిలబడి పని
  • ·కాళ్ల మీద కాలు వేసుకుని కూర్చోవడం
  • ·వేడి నీళ్లలో కాళ్లు ఎక్కువసేపు
  • ·బరువులు ఎత్తడం – రెండు వారాలు

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·కాలు ఒక్కసారిగా వాచడం, ఎర్రబడి వేడిగా ఉండటం
  • ·ఛాతీ నొప్పి లేదా ఊపిరి ఇబ్బంది
  • ·కుట్ల నుంచి చీము
  • ·జ్వరం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Vamsi Krishnaడా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి