Medicare Hospitals

ఆపరేషన్లు ›

సెబేసియస్ సిస్ట్ తొలగింపు · AI చిత్రం

సెబేసియస్ సిస్ట్ తొలగింపు

Sebaceous cyst

మత్తు: లోకల్ డే-కేర్ – అదే రోజు ఇంటికిడా. వంశీ కృష్ణ

ఎలా చేస్తారు

సంచిని మొత్తం – పొరతో సహా – తీసేస్తారు. పొర మిగిలితే మళ్ళీ వస్తుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: సిస్ట్ · చర్మం కింద గడ్డ · నూనె గడ్డ

ఖర్చు

ఈ ఆపరేషన్‌కి ఎంత అవుతుందో, ఏ రోజు ఎవరు ఉంటారో 9346113364 కి ఫోన్ చేసి అడగండి. పరీక్ష తర్వాత డాక్టర్ కచ్చితమైన మొత్తం చెబుతారు.

హాస్పిటల్ ఛార్జీలు – పూర్తి వివరాలు →

ఇది ఆపరేషన్ – తెలిసి ఉండాల్సినవి

ఏ ఆపరేషన్‌కైనా మత్తు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్, గాయం ఆలస్యంగా మానడం వంటి సమస్యలు రావచ్చు; కొందరికి మళ్ళీ చేయాల్సి రావచ్చు. మీకు ఇది అవసరమా, మీ షుగర్, బి.పి., గుండె పరిస్థితితో సరిపోతుందా అన్నది పరీక్ష, టెస్టుల తర్వాతే డాక్టర్ నిర్ణయిస్తారు. సమ్మతి పత్రం తీసుకునే ముందు మీ ఆపరేషన్‌కి ఉన్న ప్రమాదాలను ఆయన విడిగా వివరిస్తారు – అడగడానికి సంకోచించకండి.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆ చోట క్రీములు, నూనెలు రాయకండి
  • ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే చెప్పండి
  • ·షుగర్ ఉంటే చెప్పండి – మానడం నెమ్మదిగా ఉంటుంది

తర్వాత ఏం చేయాలి

  • ·కట్టు పొడిగా ఉంచండి; డాక్టర్ చెప్పిన రోజు డ్రెస్సింగ్ మార్పించండి
  • ·డాక్టర్ చెప్పిన రోజు కుట్లు తీయించుకోండి – మర్చిపోవద్దు
  • ·షుగర్ ఉంటే అది అదుపులో ఉంచుకోవడమే గాయం మానడానికి ముఖ్యం

ఏం చేయకూడదు

  • ·కట్టు తడపడం
  • ·గీకడం, సొంతంగా పొడి ఒలిచేయడం
  • ·సొంత లేపనాలు, నాటు మందులు రాయడం

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·ఎరుపు చుట్టూ పాకడం
  • ·చీము, వాసన
  • ·జ్వరం
  • ·నొప్పి పెరగడం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Vamsi Krishnaడా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి