Medicare Hospitals

ఆపరేషన్లు ›

కీహోల్ హెర్నియా ఆపరేషన్ (లాపరోస్కోపిక్) · AI చిత్రం

కీహోల్ హెర్నియా ఆపరేషన్ (లాపరోస్కోపిక్)

Laparoscopic hernia repair

మత్తు: జనరల్ సాధారణంగా 2–3 రోజులుడా. వంశీ కృష్ణ

ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: ఉబ్బు గట్టిగా మారడం, వెనక్కి వెళ్ళకపోవడం, నొప్పి, వాంతులు – ఇప్పుడే రండి

గజ్జ / బొడ్డు హెర్నియాకి చిన్న కోతల ద్వారా మరమ్మతు. ఏ పద్ధతి సరిపోతుందో పరీక్ష తర్వాత డాక్టర్ చెబుతారు

ఎలా చేస్తారు

పొట్టకి చిన్న రంధ్రాలు పెట్టి, కెమెరాతో లోపలి నుంచి చూస్తూ బయటికి వచ్చిన భాగాన్ని వెనక్కి పెట్టి, బలహీనమైన చోటును మూసి బలపరుస్తారు. రెండు వైపులా ఉంటే ఒకేసారి చేయొచ్చు.

దీన్నే ఇలా కూడా అంటారు: కీహోల్ · దూరబిన్ · పొట్టలో / గజ్జలో ఉబ్బు · చిన్న కోత

ఖర్చు

ఈ ఆపరేషన్‌కి ఎంత అవుతుందో, ఏ రోజు ఎవరు ఉంటారో 9346113364 కి ఫోన్ చేసి అడగండి. పరీక్ష తర్వాత డాక్టర్ కచ్చితమైన మొత్తం చెబుతారు.

హాస్పిటల్ ఛార్జీలు – పూర్తి వివరాలు →

ఇది ఆపరేషన్ – తెలిసి ఉండాల్సినవి

ఏ ఆపరేషన్‌కైనా మత్తు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్, గాయం ఆలస్యంగా మానడం వంటి సమస్యలు రావచ్చు; కొందరికి మళ్ళీ చేయాల్సి రావచ్చు. మీకు ఇది అవసరమా, మీ షుగర్, బి.పి., గుండె పరిస్థితితో సరిపోతుందా అన్నది పరీక్ష, టెస్టుల తర్వాతే డాక్టర్ నిర్ణయిస్తారు. సమ్మతి పత్రం తీసుకునే ముందు మీ ఆపరేషన్‌కి ఉన్న ప్రమాదాలను ఆయన విడిగా వివరిస్తారు – అడగడానికి సంకోచించకండి.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
  • ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే ముందే చెప్పండి
  • ·జలుబు, దగ్గు ఉంటే చెప్పండి – దగ్గు కుట్ల మీద ఒత్తిడి పెడుతుంది

తర్వాత ఏం చేయాలి

  • ·కట్టు పొడిగా ఉంచండి; డాక్టర్ చెప్పిన రోజు డ్రెస్సింగ్ మార్పించండి
  • ·మొదటి రోజు నుంచే మెల్లగా నడవండి
  • ·దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు ఆ చోటుని చేత్తో నొక్కి పట్టుకోండి
  • ·వదులైన లోదుస్తులు వాడండి

ఏం చేయకూడదు

  • ·బరువులు ఎత్తడం – కనీసం నాలుగు వారాలు (10 కిలోల పైన అస్సలు వద్దు)
  • ·పొలం పని, తోపుడు బండి, సైకిల్ – డాక్టర్ సరే అనేవరకు
  • ·కుట్ల మీద నీళ్లు పడనివ్వడం, గీకడం

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·ఆ చోట వాపు పెరగడం, ఎర్రబారడం
  • ·కుట్ల నుంచి చీము లేదా వాసన
  • ·జ్వరం
  • ·మూత్రం రాకపోవడం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Vamsi Krishnaడా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి