Medicare Hospitals

ఆపరేషన్లు ›

హైడ్రోసీల్ · AI చిత్రం

హైడ్రోసీల్

Hydrocele

మత్తు: స్పైనల్ సాధారణంగా 1–2 రోజులుడా. వంశీ కృష్ణ

ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి

ఎలా చేస్తారు

సంచిలో పేరుకున్న నీటిని తీసి, మళ్ళీ చేరకుండా ఆ పొరను తిప్పి కుట్టేస్తారు. చిన్న కోత.

దీన్నే ఇలా కూడా అంటారు: వృషణాల వాపు · కింద వాపు · బంతిలా వాపు

ఖర్చు

ఈ ఆపరేషన్‌కి ఎంత అవుతుందో, ఏ రోజు ఎవరు ఉంటారో 9346113364 కి ఫోన్ చేసి అడగండి. పరీక్ష తర్వాత డాక్టర్ కచ్చితమైన మొత్తం చెబుతారు.

హాస్పిటల్ ఛార్జీలు – పూర్తి వివరాలు →

ఇది ఆపరేషన్ – తెలిసి ఉండాల్సినవి

ఏ ఆపరేషన్‌కైనా మత్తు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్, గాయం ఆలస్యంగా మానడం వంటి సమస్యలు రావచ్చు; కొందరికి మళ్ళీ చేయాల్సి రావచ్చు. మీకు ఇది అవసరమా, మీ షుగర్, బి.పి., గుండె పరిస్థితితో సరిపోతుందా అన్నది పరీక్ష, టెస్టుల తర్వాతే డాక్టర్ నిర్ణయిస్తారు. సమ్మతి పత్రం తీసుకునే ముందు మీ ఆపరేషన్‌కి ఉన్న ప్రమాదాలను ఆయన విడిగా వివరిస్తారు – అడగడానికి సంకోచించకండి.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
  • ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే ముందే చెప్పండి
  • ·జలుబు, దగ్గు ఉంటే చెప్పండి – దగ్గు కుట్ల మీద ఒత్తిడి పెడుతుంది

తర్వాత ఏం చేయాలి

  • ·కట్టు పొడిగా ఉంచండి; డాక్టర్ చెప్పిన రోజు డ్రెస్సింగ్ మార్పించండి
  • ·మొదటి రోజు నుంచే మెల్లగా నడవండి
  • ·దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు ఆ చోటుని చేత్తో నొక్కి పట్టుకోండి
  • ·వదులైన లోదుస్తులు వాడండి

ఏం చేయకూడదు

  • ·బరువులు ఎత్తడం – కనీసం నాలుగు వారాలు (10 కిలోల పైన అస్సలు వద్దు)
  • ·పొలం పని, తోపుడు బండి, సైకిల్ – డాక్టర్ సరే అనేవరకు
  • ·కుట్ల మీద నీళ్లు పడనివ్వడం, గీకడం

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·ఆ చోట వాపు పెరగడం, ఎర్రబారడం
  • ·కుట్ల నుంచి చీము లేదా వాసన
  • ·జ్వరం
  • ·మూత్రం రాకపోవడం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Vamsi Krishnaడా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి