Medicare Hospitals

ఆపరేషన్లు ›

కాలి వేళ్ల / కాలు తొలగింపు · AI చిత్రం

కాలి వేళ్ల / కాలు తొలగింపు

Amputation

మత్తు: అత్యవసరం – పరిస్థితిని బట్టి డాక్టర్ చెబుతారుడా. వంశీ కృష్ణ

ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: వాసన, నలుపు రంగు, జ్వరం – రోజులు వేచి ఉండొద్దు

షుగర్ లేదా రక్తప్రసరణ ఆగిపోవడంతో కణజాలం చనిపోతే, మిగిలిన కాలును కాపాడటానికి చనిపోయిన భాగాన్ని తీయడం. ముందే వస్తే తీసేది చాలా తక్కువ

ఎలా చేస్తారు

రక్తప్రసరణ ఉన్న చోట వరకు మాత్రమే తీసి, మిగిలిన భాగాన్ని కృత్రిమ కాలు వేసుకోవడానికి వీలుగా కుడతారు. ముందుగా వస్తే తీసేది చాలా తక్కువ.

దీన్నే ఇలా కూడా అంటారు: కాలు కుళ్ళిపోయింది · షుగర్ వల్ల కాలు · వేలు నల్లబడింది

ఖర్చు

ఈ ఆపరేషన్‌కి ఎంత అవుతుందో, ఏ రోజు ఎవరు ఉంటారో 9346113364 కి ఫోన్ చేసి అడగండి. పరీక్ష తర్వాత డాక్టర్ కచ్చితమైన మొత్తం చెబుతారు.

హాస్పిటల్ ఛార్జీలు – పూర్తి వివరాలు →

ఇది ఆపరేషన్ – తెలిసి ఉండాల్సినవి

ఏ ఆపరేషన్‌కైనా మత్తు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్, గాయం ఆలస్యంగా మానడం వంటి సమస్యలు రావచ్చు; కొందరికి మళ్ళీ చేయాల్సి రావచ్చు. మీకు ఇది అవసరమా, మీ షుగర్, బి.పి., గుండె పరిస్థితితో సరిపోతుందా అన్నది పరీక్ష, టెస్టుల తర్వాతే డాక్టర్ నిర్ణయిస్తారు. సమ్మతి పత్రం తీసుకునే ముందు మీ ఆపరేషన్‌కి ఉన్న ప్రమాదాలను ఆయన విడిగా వివరిస్తారు – అడగడానికి సంకోచించకండి.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·షుగర్ అదుపులోకి తేవడం ముఖ్యం – రిపోర్టులు తీసుకురండి
  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు
  • ·కుటుంబంలో ఒకరు తోడు ఉండాలి

తర్వాత ఏం చేయాలి

  • ·మిగిలిన భాగాన్ని రోజూ చూసుకోవాలి – ఎరుపు, వాపు, కారుడు ఏమైనా ఉందా
  • ·డాక్టర్/ఫిజియో చెప్పిన వ్యాయామాలు రోజూ – కృత్రిమ కాలు వేసుకోవడానికి అవే సిద్ధం చేస్తాయి
  • ·రెండో కాలును ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి; రోజూ అరికాలు చూడాలి
  • ·షుగర్ అదుపు – ఇది ఆపరేషన్ కంటే ముఖ్యం

ఏం చేయకూడదు

  • ·చెప్పుల్లేకుండా నడవడం
  • ·కట్టు తడపడం
  • ·నొప్పి ఉందని వ్యాయామాలు మానేయడం
  • ·పొగ తాగడం – రక్తప్రసరణ ఇంకా తగ్గుతుంది

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·కుట్ల దగ్గర ఎరుపు, చీము, వాసన
  • ·జ్వరం
  • ·నొప్పి పెరగడం
  • ·రెండో కాలిపై కొత్త పుండు

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Vamsi Krishnaడా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి